ETV Bharat / state

Huzurabad BY election: :ఈటల ఓటమే లక్ష్యంగా తెరాస.. రంగంలోకి ముగ్గురు మంత్రులు

హుజూరాబాద్‌‌ ఉపఎన్నికలో గులాబి జెండా ఎగరడం ఖాయం అంటూ ప్రచారం చేస్తున్నా తెరాస తిరుగులేని పట్టు సాధించినా ఇంకా ప్రచారంలో జోరు పెంచుతోంది. ఫిరాయింపులకు ఎనలేని విధంగా ప్రోత్సహిస్తోంది. మాజీ స్నేహితుడు ఈటల ఓటమే లక్ష్యంగా ఐదు నెలలుగా చేసిన ప్రయత్నాలతో సంతృప్తి చెందలేదా లేక ఇంకా అనుమానం వెంటాడుతోందా అన్నదే అంతు చిక్కకుండా తయారైంది. ఏకంగా ముగ్గురు మంత్రులతో పాటు… సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

TRS ministers election compaign
ఈటల ఓటమే లక్ష్యంగా తెరాస ప్రచారం
author img

By

Published : Oct 8, 2021, 4:47 AM IST

హుజూరాబాద్‌‌ ఉపఎన్నికలో గెలిచేందుకు అధికార తెరాస ప్రచార జోరు పెంచింది. ఎలాగైనా సరే హుజురాబాద్‌లో పట్టు బిగించేందుకు ఏకంగా ముగ్గురు మంత్రులను రంగంలోకి దించింది. వారంతా అక్కడే మకాం వేసి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడమే కాకుండా సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చేందుకు శతవిధాల యత్నిస్తున్నారు. తన్నీరు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లు అన్నీ తామై తెరాస అభ్యర్ధిని గట్టెక్కించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు పార్టీ పట్టు బిగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.. అడపా దడపా వివిధ శాఖల మంత్రులు కూడా హుజురాబాద్​ను చుట్టేసి సామాజిక వర్గాల వారిగా మంత్రాంగం నడిపించడం ఆసక్తికరంగా మారింది.

సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ హుజురాబాద్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి దిశా నిర్దేశం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మంత్రి కేటీఆర్‌ కూడా ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్లుగా పేర్లు ఇవ్వడంతో ఈ ఎన్నికకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో స్పష్టం అవుతోంది.. అంతర్గత సమాచారానికి అనుగుణంగా హుజురాబాద్‌లో సమీకరణాలను మారుస్తున్నారు. తరచూ ముఖ్యమంత్రి ఇక్కడి ఎన్నికలపై ఆరా తీస్తూ ఇంఛార్జీలతో చర్చ జరుపుతున్నట్లు సమచారం.

నిధుల ప్రవాహం..కొనసాగినా…

ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలకు కేరాఫ్‌గా మారిన హుజురాబాద్ మరో వైపు దళిత బంధు పైలట్ ప్రాజెక్టుతో నిధుల వరద ప్రవాహం కొనసాగిందనే చెప్పాలి. ఇక్కడి ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకోవడమే లక్ష్యం అనే రీతిలో సర్కారు వ్యవహరిస్తోందన్న ప్రచారం కొనసాగుతోంది. దళిత బంధు మొదలుకొని గ్రామాల్లో చేపట్టే అభివృద్ది పనుల వరకు నిధులు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. ఇక్కడి ఓటర్లను ప్రభావితం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంచలనంగానే మారాయని చెప్పక తప్పదు.

ఈటలను ఒంటరిని చేసినా..

హుజురాబాద్ ఉప పోరులో ఈటలపై తెరాస రాజకీయంగా మూకుమ్మడి దాడి చేస్తోందనే చెప్పాలి. తెరాసను వీడిన తరువాత ఈటల రాజేందర్ వెంట నడిచిన ప్రతి ఒక్కరిని తమవైపు తిప్పుకుంటున్న ముఖ్య నాయకులు ఈటల రాజేందర్‌ను ఒంటరిని చేసే ప్రయత్నం చేశారు. అతనికి మద్దతు ఇచ్చే ఏ ఒక్కరిని వదలకుండా గులాబి కండువా కప్పి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులను, భాజపా కౌన్సిలర్లను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే భాజపాకు ఓటేయాలని ప్రచారం చేసే క్యాడర్ ఆయన పంచన లేకుండా చేశారనే ఈటలకు సానుభూతిని తెచ్చిపెడుతోందన్న అభిప్రాయం ఏర్పడింది. దీంతో ఈటల రాజేందర్ స్వయంగా పల్లెలు తిరుగుతూ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆయన వ్యతిరేకులను చేరదీయడంతో పాటు వారితోనే గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ముందుకు సాగుతున్నారు. చివరకు ఈటలకు అత్యంత పట్టున్న గ్రామాలను గుర్తించి అక్కడ తెరాస పట్టు బిగించే యత్నం చేస్తోంది.

ఓటరు నాడీ దొరక్క ఉత్కంఠ..

గత అయిదు నెలలుగా తెరాస విశ్వప్రయత్నం చేస్తున్నా కూడా పట్టు సాధించామా అన్నది మాత్రం మిస్టరీగానే ఉండి పోయింది. ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సఫలం అయ్యాయా లేదా అన్న చర్చ సాగుతోంది. ప్రజల్లో ఈటలపై ఉన్న సానుభూతిని తగ్గించి తమకు అనుకూలంగా మల్చుకునేందుకు జోరు పెంచారు. గులాబి తీర్థం పుచ్చుకున్నప్పటికి కొంతమంది నాయకులు ఈటలతో ఉన్న అనుబంధం మర్చిపోలేకపోతున్నారన్నారు. దీంతో వారిలో కొంతమంది గుంభనంగా ఉంటున్నారన్న విషయాన్ని అధిష్టానం గుర్తించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పోలింగ్ జరిగే నాటి వరకూ ఎలా ముందుకు సాగాలి, ఓటర్లను ఎలా ప్రభావితం చేయాలి అన్న విషయంపైనే దృష్టి సారించారు. ఏది ఏమైనా తెరాస హుజూరాబాద్​లో తిరుగులేని పట్టు సాధించినట్లు నేతలు ప్రచారం చేసుకుంటున్నా లోపల మాత్రం దడగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: Huzurabad Bypoll Nomination: మమ్మల్ని నామినేషన్​ వేయనీయరా? ఏంటండీ కుంటిసాకులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.