కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు శేషం నర్సింహాచార్యులు సతీమణి కరోనాతో సోమవారం అర్దరాత్రి మరణించారు. మంగళవారం ఉదయం జిల్లా ప్రభుత్వాసుపత్రి నుంచి అంబులెన్స్‌లో ఆమె మృతదేహాన్ని అంత్యక్రియలు జరిగే స్థలానికి తీసుకు వచ్చి నేరుగా చితిమీదకు దించారు.
అంబులెన్స్ సిబ్బందితోపాటు మృతురాలి కుమారుడు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆమె భర్త, కుమార్తెతోపాటు బంధువులను ఎవరినీ అనుమతించకుండా కార్యక్రమం పూర్తి చేశారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువుల కడ చూపుకు కూడా నోచుకోకుండా అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: 'ఓడిపోతామనే భయంతోనే అరెస్టులు చేయిస్తున్నారు'