కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో పన్నుల వసూలు జోరందుకుంది. పురపాలక సంస్థ ఎన్నికల్లో పోటీచేసే ఆశావాహులు తమ బకాయిలు చెల్లిస్తున్నారు. పన్ను చెల్లించడానికి అభ్యర్థులు పోటీ పడ్డారు. ఒక్క రోజే నగరపాలక సంస్థకు రూ.15 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో ఆస్తి పన్ను రూ.8. 60 లక్షలు, నల్ల బిల్లు రూ.6.50 లక్షలు వసూలు అయినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : మిస్సింగ్ కేసును ఛేదించిన తెలంగాణ పోలీస్