రాష్ట్రంలో స్మార్ట్‌సిటీ నిధులను సక్రమంగా వినియోగించడం లేదంటూ కరీంనగర్ జిల్లా భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్రం నిధులను విడుదల చేసినప్పటికి రాష్ట్రప్రభుత్వ వాటా చెల్లించడం లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. ఇప్పటివరకు మూడు పర్యాయాలు కేంద్రం, రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన వాటా చెల్లించని తెరాస ప్రభుత్వం, కేంద్రంపై విమర్శలు గుప్పించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. స్మార్ట్‌సిటీ నిధులపై జరుగుతున్న అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టాలని నగరపాలక కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం: శ్రీనివాస్ గౌడ్