ETV Bharat / state

గోదారి, మానేరు నదుల్లో దర్జాగా ఇసుక దోపిడీ - గోదావరి ఇసుక అక్రమ రవాణా

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా దర్జాగా సాగుతోంది. గోదావరి, మానేరు నదులతోపాటు వాగులు వంకల్లోని సహజ సంపదని దొరికినంతగా దోచేస్తున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వుతూ ఇసుకను లూటీ చేస్తున్నారు. అధికారులు పోలీసుల మాత్రం చోద్యం చూస్తున్నారు.

Sand
Sand
author img

By

Published : Jul 4, 2020, 12:59 PM IST

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. అక్రమార్కులు కేసులకు వెరవడం లేదు. కాసుల కక్కుర్తియే ధ్యాసగా.. శ్వాసగా కొందరు వ్యాపారులు అక్రమాలకు తెరతీస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని గోదావరి, మానేరు నదులతోపాటు వాగులు వంకల్లోని సహజ సంపదని దొరికినంతగా దోచేస్తున్నారు.

అధికారులు, పోలీసుల ఉదాసీనతే ఆసరాగా అక్రమ దందాను ఇంతకింతకు పెంచేస్తున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వుతూ ఇసుకను లూటీ చేస్తున్నారు. తమ అక్రమానికి మరేది సాటికాదనే తీరుని చేతల్లో కనబరుస్తున్నారు. తమ వ్యవహారం ముందర నిబంధనలు, దాడులు ఏ మాత్రం పనిచేయవనే పంథాను దందా ముసుగులో చూపిస్తున్నారు.

రోజుకు.. లక్షల్లో వ్యాపారం..!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు సుమారుగా 600 నుంచి 1000 వరకు ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా దొంగిలిస్తున్నారు. ముఖ్యంగా 95కి.మీ మేర జిల్లాలో ఉన్న గోదావరి నది పరివాహక ప్రాంతంతోపాటు 110కి.మీకుపైగా దూరంలో ఉన్న ఎగువ, మధ్య, దిగువ మానేరు నది తీర ప్రాంతాల్లో రేయింబవళ్లు అక్రమం సాగుతోంది. సుమారుగా 80కిపైగా గ్రామాల చెంతన ఈ చౌర్యం జరుగుతున్నా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఒక్కో ట్రాక్టర్‌కు రూ.2800 నుంచి రూ.3500 వరకు ఆదాయం వస్తుండటం, బయట ఇసుక రీచ్‌ల కన్నా దొడ్డిదారిన తవ్వుకునే ఇసుక వల్లనే అధిక లాభాలుండటంతో వ్యాపారులు ఇటువైపునకే మొగ్గు చూపుతున్నారు. ఇక ఏళ్ల తరబడి సాగిస్తున్న ఇసుకు వ్యాపారంలో నిత్యం లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఇక చాలా చోట్ల వీరికి పలువురు బడానేతల సహకారం సంపూర్ణంగా ఉండటంతో వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.

ఇక పలుచోట్ల రెవెన్యూ అధికారులతోపాటు పోలీసులకు మామూళ్లు అందుతుండటంతో మిన్నకుంటున్నారనే ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. అక్కడక్కడ ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారని మండలస్థాయిలోని అధికారులు, పోలీసుల వ్యవహారంపై జిల్లాస్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక వ్యాపారం గురించి తెలుస్తున్నా చాలా చోట్ల నిఘా, పర్యవేక్షణ విషయంలో మొక్కుబడి తీరే కనిపిస్తోంది. ఇక ఆయా గ్రామాల చెంతన పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో తెచ్చిన ఇసుకను అక్రమంగా డంపుల రూపంలో నిల్వ ఉంచుతున్నారు. వీలును బట్టి టిప్పర్లు, లారీల్లో తరలిస్తున్నారు.

ఎక్కడెక్కడ ఎలా..?

  • గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో అధికంగా ఈ చౌర్యం రేయింబవళ్లు సాగుతోంది. ప్రస్తుత వానాకాలంలో నీళ్లు అక్కడక్కడ నిలువ ఉన్న చోట మినహాయించి మిగతా చాలాచోట్ల యథేచ్ఛగా ట్రాక్టర్లు, లారీలతో అందినకాడికి తరలిస్తున్నారు.
  • జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని రాజారం, జైనా, దొంతాపూర్‌, దమ్మన్నపేట, ఆరెపల్లి గ్రామాల చెంతనుంచి సుమారుగా 200 ట్రాక్టర్లలో తవ్వుకుపోతున్నారు. గోదారినుంచి తీసుకొచ్చి పలుచోట్ల పెద్ద మొత్తంలో డంపు చేసి వీలునిబట్టి విక్రయిస్తున్నారు.
  • మల్లాపూర్‌ మండలంలోని సంగెం శ్రీరాంపూర్‌, పాతదామరాస్‌పల్లి, వాల్గొండ, వెంకట్రావ్‌పేట సారంగాపూర్‌ మండలంలోని చిన్న కొల్వాయ్‌, కమ్మునూర్‌, రాయికల్‌ మండలంలోని బోర్నపల్లితోపాటు కొన్ని గ్రామాల సమీపంలోని గోదావరి నదిలో నుంచి ఇసుకను దొంగిలిస్తున్నారు.
  • సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం మల్లాపూర్‌, మాన్వాడ, వేములవాడ మండలంలోని తంకెపల్లి, మూలవాగు నుంచి, ఇల్లంతకుంట మండలం పొత్తూరు, కందికట్కుర్‌ గ్రామాల సమీపంలోని మానేరు నది నుంచి నిత్యం ఇసుకను ట్రాక్టర్లు, లారీల్లో తీసుకెళ్తున్నారు.
  • కరీంనగర్‌ గ్రామీణ మండలం ఇరుకుల్లతో పాటు తిమ్మాపూర్‌, గన్నేరువరం, మానకొండూర్‌, వీణవంక మండలాల్లోని మానేరు నది పరివాహక ప్రాంతాలతో పాటు ఆయా గ్రామాల్లోని వాగుల నుంచి ఎంతలేదన్నా ప్రతి నిత్యం 200కు పైగా ట్రాక్టర్ల ఇసుకను ఎంచక్కా నింపుకొని బాహాటంగా వెళ్తున్నారు.
  • పెద్దపల్లి జిల్లాలోనూ అటు గోదావరి తీర ప్రాంతాల్లోని కొన్నిచోట్ల, ఇటు మానేరు నది ప్రవహించే మార్గంలో ఇంకొన్ని చోట్ల ఈ తవ్వకాల్ని చేపడుతున్నారు. సుల్తానాబాద్‌ మండలం గొల్లపల్లి, గర్రెపల్లి, నీలుగుళ్ల, గడ్డెపల్లి గ్రామాల నుంచి దండిగానే వాహనాలు తరలివెళ్తున్నాయి.

ధర్మపురి మండలంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక

  • నాలుగు రోజుల కిందట ధర్మపురి మండలం జైనలో ఓ వ్యక్తి ఇసుక అక్రమ రవాణాను అధికారులు అడ్డుకోవడం లేదని ఆరోపిస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్‌ సీసాతోపాటు భవనంపైకి ఎక్కిన అతను పోలీసులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై అక్రమ రవాణాను ఆపడం లేదని తన ఆవేదనను నిరసన రూపంలో తెలియజేశాడు.
  • ఇసుక వ్యవహారంలో తలదూర్చిన ఓ ఎస్సైపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు నిన్నటికి నిన్న సస్పెన్షన్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నాలుగు నెలల కిందట సిరిసిల్ల జిల్లాలోని ఓ ఎస్సై, సీఐలతోపాటు కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు ఇసుక అక్రమం విషయంలోనే డబ్బులు డిమాండ్‌ చేశారనే విషయమై వల పన్ని పట్టుకున్నారు. పట్టుబడిన ఓ ఇసుక వాహనాన్ని కేసు నమోదు కాకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్‌ చేసిన తీరులో వీరంతా అనిశాకు దొరికిపోయారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా విలయతాండవం... 20వేలు దాటిన కేసుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.