తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ.. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. డిపోలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కేంద్రంలోని రెండు డిపోల ముందు ధర్నా చేపట్టారు. స్వచ్ఛందంగా సమ్మె విరమణ చేసినప్పటికీ తమను విధుల్లోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: జేబీఎస్ వద్ద రెండో రోజూ కార్మికుల అరెస్ట్