వారం రోజులుగా కురిసిన వర్షాలకు... కరీంనగర్‌లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. చిన్నపాటి వర్షాలకే నగరం చిత్తడిగా మారుతోంది. తాత్కాలిక మరమ్మతుల పేరిట లక్షలు ఖర్చు చేస్తున్నా... ప్రయోజనం శూన్యంగా మారింది. అంతర్గత వీధుల్లో నీరు నిలిచి గుంతల లోతు తెలియక ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు.
నగరంలోని కట్టరాంపూర్, భగత్‌నగర్, రాంచంద్రాపూర్ కాలనీ, పోచమ్మవాడ, లక్ష్మినగర్ తదితర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కొంతమేర పనులు చేయడం.. మరికొద్ది రోజుల వరకు ఆ ఊసే లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు. వర్షాలు తగ్గగానే మరమ్మతులు చేపడుతామని... నగర మేయర్ సునీల్ రావు వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్నిచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కొత్త రోడ్లను నిర్మించకపోయినా ఫర్వాలేదు కానీ... బురదమయంగా మారిన రహదారులకు మరమ్మత్తులు చేపట్టాలని... స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలంటున్నారు.
ఇదీ చూడండి: 'ఆ జిల్లాలో 40 శాతం మందికి కరోనా వచ్చినట్లు రిపోర్టు'