కరీంనగర్- రామగుండం రాజీవ్ రహదారిలోని బొమ్మనకల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఠాణాలో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న తిరుపతి ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు.
మంగళవారం విధులు నిర్వహించుకుని సుల్తానాబాద్ నుంచి కారులో వస్తుండగా బొమ్మకల్ వద్ద ఎదురుగా వచ్చిన కంటైనెర్ ఢీకొట్టింది. ఘటనలో కారు కుడి భాగం పూర్తిగా దెబ్బతిన్నది. రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు చిన్నగా ఉండటం వల్ల... వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని శవపరీక్ష కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: భారత్, చైనాలు సంయమనం పాటించాలి: ఐరాస