ETV Bharat / state

రేషన్​ బియ్యానికి రెక్కలు... తనిఖీల్లో తరచూ పట్టివేతలు - karimnagar district news

పేదలకు చేరాల్సిన రేషన్​ బియ్యం యధేచ్ఛగా పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్ల అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. రేషన్‌ బియ్యాన్ని తెలివిగా తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు వాటిని పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకునే వ్యాపారులు పెరిగిపోతున్నారు. కొన్ని చోట్ల డీలర్లే బయటి వ్యాపారులకు అమ్ముకుంటున్న దారుణాలు కూడా జరుగుతున్నాయి. పోలీసులు బియ్యం దందా చేసినవారిపై పీడీ యాక్ట్​ నమోదు చేస్తామని హెచ్చరికలు చేసినా... ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు.

ration rice to black market in karimnagar district
రేషన్​ బియ్యానికి రెక్కలు... తనిఖీల్లో తరచూ పట్టివేతలు
author img

By

Published : Jul 23, 2020, 10:03 AM IST

పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. ప్రతినెలా కోటాలో ఎక్కువ శాతం దొడ్డిదారిన నల్లబజారుకు తరలిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సదుద్దేశంతో అందిస్తున్న చౌక బియ్యం విషయంలో ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో నిర్లక్ష్యం పెరుగుతోంది.

పర్యవేక్షణ లేకపోవడంతోపాటు కఠినమైన చర్యలు కనిపించకపోవడం వల్ల బియ్యం మాఫియా పేట్రేగుతోంది. ఇష్టానుసారమనే తీరుతో లబ్ధిదారులకు అందిన బియ్యంతోపాటు అందించాల్సిన వాటి విషయంలో అక్రమ రవాణా రోజుకింతగా రెక్కలు తొడుగుతోంది. ఫలితంగా ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. పట్టుబడిన ప్రతి సందర్భంలో ఇది సాధారణమే అని అనిపిస్తున్నా.. దీని వెనుకలా మాత్రం ఊహించని అక్రమతంతు నాలుగు జిల్లాల పరిధిలో కొనసాగుతోంది.

కనిపించని నిఘా..!

కిలో బియ్యానికి దాదాపుగా రూ.26 చొప్పున రాయితీ భరిస్తూ కరీంనగర్​, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని 9.66 లక్షల మంది కార్డుదారులకు 29.614 మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని ప్రతి నెలా పంపిణీ కోసం సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం వీటికి గానూ సుమారుగా రూ.76కోట్ల రాయితీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి.

ఇంత పెద్దమొత్తాన్ని వెచ్చించి చౌకధరల దుకాణాలకు చేరుతున్న వాటిని అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. ఇటీవల లాక్​డౌన్​ ఆంక్షల తర్వాత ఉమ్మడి జిల్లాలో తరచూ పోలీసుల తనిఖీల్లో వందలాది క్వింటాళ్ల రేషన్​ బియ్యం ఆయా ప్రాంతాల్లో పట్టుబడుతోంది.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సగటున రెండు రోజులకోసారైనా పెద్దమొత్తంలో చౌక బియ్యాన్ని అధికారులు, పోలీసులు పట్టుకుంటున్నారు. పౌరసరఫరా శాఖ అధికారులు ఇలా పట్టుకున్న బియ్యాన్ని స్వాధీన పర్చుకుని వారిపై 6ఏ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ అక్రమ రవాణా ఆగడంలేదు. ఇలా ప్రతి నెలలో అందుతున్న కోటాలో ఎంతలేదన్నా సగానికిపైగా నల్లబజారుకు బియ్యం చేరుతోంది. ఈ లెక్కన నాలుగు జిల్లాల పరిధిలో రూ.38కోట్ల విలువైన రాయితీ బియ్యం పక్కదారి పడుతోంది.

పొరుగు రాష్ట్రాలకు రవాణా..

ప్రతి నెలా కార్డుదారుకు 6కిలోల బియ్యాన్ని గతంలో ఇవ్వగా.. ఇటీవల కరోనా ప్రభావంతో ఉచితంగా ప్రతి వ్యక్తికి 12 కిలోలలను అందించారు. ఈ నెల నుంచి 10కిలోల చొప్పున ఇస్తున్నారు. ఇలా ఇస్తున్న బియ్యం విషయంలో దొడ్డిదారిన అమ్మకాల జోరు నాలుగు జిల్లాల్లో ఇంతకింతకు పెరుగుతోంది.

రేషన్‌ బియ్యాన్ని తెలివిగా తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు వాటిని పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకునే వ్యాపారులు పెరిగిపోతున్నారు. కొన్నిచోట్ల డీలర్లలో కొందరు కక్కుర్తిపడి బయట వ్యాపారులకు అమ్ముతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.

ఎక్కువ మొత్తంగా మాత్రం వ్యాపారులు ఆయా గ్రామాలతోపాటు పట్టణాల్లో కూలీల ద్వారా బియ్యం సేకరించి దందాను కొనసాగిస్తున్నారు. సేకరిస్తున్న బియ్యాన్ని పోగుచేసి పక్క రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ బియ్యంపై పసుపు నీళ్లను చల్లి దేవాలయం నుంచి సేకరించామనే ఎత్తుగడల్ని కొందరు వ్యాపారులు అనుసరిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో అధికారుల్ని మచ్చిక చేసుకుంటున్న దళారులు రాత్రివేళ రవాణాను సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఊళ్లల్లో తిరుగుతూ కిలో బియ్యాన్ని రూ.10-15 వరకు కొంటుండగా దళారులు వీటిని రూ.18తో అవసరమైన చోటకు తరలిస్తున్నారు. చాలాచోట్ల అనర్హులకు తెల్లకార్డులు ఉండటంతో వారికి వచ్చిన బియ్యాన్ని ప్రతి నెలా అమ్ముకుంటున్నారు.

ఇలా కొనుగోలు చేసిన వాటిని వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. పశువుల దాణాతోపాటు బీర్ల పరిశ్రమలకు తరలిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా పట్టుబడుతున్న వారు పదేపదే ఇదే దందాను కొనసాగిస్తున్నారు. వారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తామని చెప్పే పోలీసుల మాటలు ఆచరణకు దూరంగానే ఉంటున్నాయి.

ఈ ఏడాదిలో పట్టుబడ్డాయిలా..

జిల్లా కేసులుక్వింటాళ్లు

విలువ

(రూ.లక్షల్లో)

కరీంనగర్​ 24110619.15
జగిత్యాల 445418.04
పెద్దపల్లి354865.56
సిరిసిల్ల322552.80
మొత్తం135238835.55

ఇవీ చూడండి: అక్రమంగా తరలిస్తున్న 570 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.