ETV Bharat / state

ప్రజాసేవలో ప్రజల మనిషి

ప్రజల సహకారంతో చదువుకున్నాడు. తనకు జీవితాన్నిచ్చిన ప్రజల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. మానవ సేవే మాధవ సేవని గుర్తించి... మదర్ థెరిస్సా తత్వాన్ని పుణికి పుచ్చుకొని ఉచితంగా వైద్య సేవలందిస్తున్నాడు కరీంనగర్ జిల్లావాసి.

ప్రజాసేవలో ప్రజల మనిషి
author img

By

Published : May 26, 2019, 9:04 AM IST

ప్రజాసేవలో ప్రజల మనిషి

కరీంనగర్ జిల్లా మూలసాల గ్రామానికి చెందిన బంక మల్లేశంకు చిన్నప్పటి నుంచి వైద్య వృత్తి అంటే ఎనలేని ప్రేమ. మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివిన అతనికి ఆర్థిక స్థోమత లేక చాలా ఇబ్బందులు పడ్డాడు. మల్లేశానికి వైద్యవిద్య మీద ఉన్న ఆసక్తి గమనించిన స్థానిక ప్రజలు అతని చదువకయ్యే ఖర్చుని భరించారు. ప్రజల సొమ్ముతో వైద్య వృత్తి చేపట్టి... ప్రభుత్వ వైద్యుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఉద్యోగ విరమణ అనంతరం ఎమ్మెస్ పూర్తి చేశాడు. సర్కారు డాక్టరుగా ఎనలేని సేవలందించిన మల్లేశం... జీవితాన్నిచ్చిన వారి కోసం జీవితాంతం సేవలందించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇంటి దగ్గరే ప్రైవేటు క్లినిక్ ప్రారంభించాడు. వారంలో మూడు రోజుల ఉచిత చికిత్సలు చేస్తూ... మదర్ థెరిస్సా బాటలో నడుస్తున్నాడు.

ప్రతిరోజు ఉదయాన్నే ఎస్.ఆర్.ఆర్ కళాశాల మైదానానికి చేరుకొని కసరత్తులు చేస్తాడు. అనంతరం వాకర్స్​కి వ్యాయామ తరగతులు చెప్తాడు. మొదట్లో నడకదారులు బంక మల్లేశంను హేళన చేశారు. పొంతన లేని వ్యాయామం చేస్తుంటారని చులకనగా చూశారు. అవేమీ పట్టించుకోకుండా డాక్టర్ మల్లేశం ప్రతి ఒక్కరిని వ్యాయామం చేయాలని సూచించారు. ఐదుగురితో ప్రారంభమైన వ్యాయామం ప్రస్తుతం వంద మందికి చేరింది.

మెడ, వెన్ను, భుజాల నొప్పులతో బాధపడుతున్న వారితో వ్యాయామం చేయించి నొప్పులను మాయం చేశాడు మల్లేశం. డాక్టర్ మల్లేశం వల్లే తన రోగాలు నయమయ్యాయని చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐదు సంవత్సరాల క్రితం మొదలైన ఆయన ప్రస్థానం శ్వాస ఉన్నంత వరకు సాగిస్తానని చెబుతున్నారు.

ఇవీ చూడండి: నేడు తిరుమలకు ముఖ్యమంత్రి కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.