ETV Bharat / state

Dharmapiri Arvind: 'హుజూరాబాద్​లో గెలుపు ఏకపక్షమే.. 25 వేల మెజార్టీతో గెలుస్తాం' - నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​

తెరాస ప్రభుత్వంపై నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్​లో భారీ మెజార్టీతో భాజపా గెలవబోతోందని అర్వింద్​ జోస్యం చెప్పారు. తెరాస నాయకులు హామీలు ఇవ్వటం వరకేనని.. వాటిని అమలు చేయటం వాళ్ల ఇంటావంటా లేదని ఎద్దేవా చేశారు.

nizamabad mp darmapuri arvind fire on trs leaders in huzurabad

author img

By

Published : Oct 27, 2021, 4:48 PM IST

ఇచ్చిన ఒక్క హామీని కూడా తెరాస ప్రభుత్వం నెరవేర్చలేదని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఆరోపించారు. హుజూరాబాద్​లో సమావేశమైన అర్వింద్​.. తెరాస సర్కార్​పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2014లో తెరాస పార్టీ విడుదల చేసిన మానిఫెస్టోలో పేర్కొన్న హామీలు గుర్తు చేస్తూ.. ఏ ఒక్కటీ అమలు చేయలేదని ధ్వజమెత్తారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక విడుదల చేసిన మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా అన్ని బుట్టదాఖలే అయ్యాయని స్పష్టం చేశారు.

25 వేల మెజార్టీతో గెలుస్తాం..

"హుజూరాబాద్​లో ఎన్నికలే లేవు. ఏకపక్షంగా పూర్తి మెజార్టీతో భాజపాదే విజయం. ఈటల రాజేందర్​ గెలవటం ఖాయం. 25 వేలకు పైగా మెజార్టీతో గెలవబోతున్నాం. గెల్లు శ్రీనివాస్​ గెలిస్తే.. మెడికల్​ కళాశాల తెస్తామని ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. మరి 2014లో విడుదల చేసిన మానిఫెస్టోలోనే ఈ అంశం ఉంది. అప్పటి నుంచి దాన్ని పక్కన పారేసి.. ఇప్పుడు కొత్త హామీ ఇస్తున్నట్టు ప్రజలను కొత్తగా మభ్యపెడుతున్నారు. దళిత బంధు అమలు కాకపోతే.. పేరు మార్చుకుంటామని మంత్రి హరీశ్​రావు సవాల్​ చేస్తున్నారు. మరి తెరాస మానిఫెస్టోల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చనందుకు ఏం చేస్తారో చెప్పాలి." - ధర్మపురి అర్వింద్​, నిజామాబాద్​ ఎంపీ

మరో ఉద్యమానికి సిద్ధం..

హుజూరాబాద్​ గెలుపుతో.. 2023లో రాష్ట్రంలో భాజపా అధికారం చెపట్టేందుకు పునాది పడబోతోందని అర్వింద్​ ధీమా వ్యక్తం చేశారు. 2023లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తామని తెలిపారు. ఈ ఎన్నికలు కాగానే.. మరో ఉద్యమానికి తెరలేపనున్నామని ప్రకటించారు. ఇందూరులో చెరుకు రైతులతో కలిసి ఉద్యమం చేయనున్నామని అర్వింద్​ తెలిపారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.