Night Bazaar in Karimnagar : మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రజల అభిరుచులు మారుతున్నాయి. మహానగరాల్లో మాదిరిగా సాయంత్రం, రాత్రిళ్లు బయటకు వెళ్లాలంటే.. కరీంనగర్ వాసులకు సరైన సదుపాయాలు లేవు. ప్రస్తుతం రాత్రి 11 వరకే హోటళ్లు, దుకాణాలు అందుబాటులో ఉంటున్నాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నైట్‌బజార్, ఫుడ్‌కోర్టులు ఏర్పాటుచేయాలని కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్ణయించింది.
రాష్ట్రంలో తొలిసారిగా ఓ నగరపాలక సంస్థ.. ఆధ్వర్యంలో శాతవాహన విశ్వవిద్యాలయం సమీపంలో నైట్‌బజార్, ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. నైట్‌బజార్లలో ఫుడ్‌కోర్టుల వద్ద ఆకర్షణీయమైన సీటింగ్, చిన్న చిన్న పార్కులు, చక్కటి లైటింగ్, మంచినీటి వసతి, టాయిలెట్స్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. ఫుడ్‌కోర్టులో 25 నుంచి 30 వరకు స్టాల్స్‌ను ఏర్పాటు చేసి వెజ్, నాన్‌వెజ్ ఫుడ్ ఐటమ్స్‌తో పాటు.. పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఆట వస్తువులు అందుబాటులో ఉంచనున్నారు.
Karimnagar Night Bazaar : ఆయా ఫుడ్‌స్టాళ్లలో శుచి,నాణ్యత కలిగిన రుచికరాహారం అందించనున్నట్లు నగర మేయర్ సునీల్‌రావు వెల్లడించారు. వీటితో పాటు వివిధ రకాల వస్తువులు అందుబాటులో ఉండేలా షాపులు నిర్వహించుకోవడానికి వీలుగా స్టాల్స్‌ను నిర్మిస్తున్నారు. పార్కింగ్, భద్రతకి సీసీ కెమెరాలు ఏర్పాటు, పోలీసులు గస్తీ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాత్రిళ్లు విద్యుద్దీప కాంతుల్లో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
Ministers visit South Korea : కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్‌లో మ్యూజికల్ ఫౌంటెన్!
Karimnagar Latest News : కరీంనగర్ నగర పౌరులకు అర్బన్ నైట్ లైఫ్ రుచిని అందిస్తూ నగరంలో నైట్బజార్లను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నప్పటికీ రాత్రి జీవితం అంతంత మాత్రంగానే ఉందని..కొత్తగా ప్రారంభిస్తున్న నైట్‌బజార్‌లో రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నైట్బజార్లు పనిచేయడానికి అనుమతించడం సంతోషంగా ఉందని పేర్కొంటున్నారు.
"రాష్ట్రంలో మొదటిసారిగా బల్దియా ఆధ్వర్యంలో.. కరీంనగర్‌లో నైట్‌బజార్‌ను ఏర్పాటు చేస్తున్నాం. శాతవాహన విశ్వవిద్యాలయం సమీపంలో ప్రారంభిస్తున్నాము. నైట్‌బజార్‌లో ఫుడ్‌కోర్టులు, వివిధ రకాల వస్తువుల స్టాళ్లు ఏర్పాటుచేయనున్నారు. ప్రజల స్పందనకు అనుగుణంగా మరిన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం". - సునీల్‌రావు, కరీంనగర్ మేయర్
కొత్తగా ప్రారంభిస్తున్న నైట్‌బజార్‌లో రాత్రి 9 నుంచి 12 గంటల వరకు కార్యకలాపాలు సాగనున్నాయి. ఒక్కో దుకాణానికి 15 అడుగుల స్థలం కేటాయించనున్నారు. సోలార్ లైటింగ్ సిస్టమ్‌తో పాటు, నైట్ బజార్‌ల సైన్ బోర్డులు కూడా ప్రదర్శిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి.. కరీంనగర్‌లోకి వచ్చే ఐదు ప్రధాన రహదారుల్లోనూ నైట్‌బజార్‌ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Karimnagar Cable Bridge : కరీంనగర్ 'కేబుల్ బ్రిడ్జి' అందాలు అదరహో.. డ్రోన్ విజువల్స్ ఇదిగో..!