కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్లలోని స్వయంభూలక్ష్మీ గణపతి ఆలయంలో నవమి వార్షికోత్సవ వేడుకలు ముగిశాయి. పురోహితుడు నంబి వేణుగోపాలస్వామి కౌశిక ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహించారు.
కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. చివరి రోజున మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, సంస్కృతి, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.
ఇవీ చూడండి: రేపు మేడారానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్