భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నియామక పత్రం జారీ చేశారు. బండి సంజయ్ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని అధిష్ఠానం పేర్కొంది.
బండి సంజయ్ బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్లో పని చేశారు. ఏబీవీపీ, భాజపా యువ మోర్చలో వివిధ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించారు. ది కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో రెండు పర్యాయాలు డైరెక్టర్‌గా పని చేశారు. అడ్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంఛార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. కరీంనగర్ నగర పాలక సంస్థ ఏర్పడిన తర్వాత మూడు సార్లు కార్పొరేటర్‌గా విజయం సాధించారు. వరుసగా రెండుసార్లు భాజపా నగర అధ్యక్షునిగా పనిచేశారు.
2014 శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో తెరాస అభ్యర్థి గంగుల కమలాకర్‌పై పోటీచేసి.... 66వేల ఓట్లుతో రెండో స్థానంలో నిలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 96వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.