కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఈఈ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై విద్యుత్ శాఖ ఉద్యోగులు చేపడుతున్న నిరాహారదీక్షకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు కల్పించింది విద్యుత్ శాఖ అని చెప్పక తప్పదని జీవన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, గృహావసరాల ద్వారా రాష్ట్రంపై ఆర్థికంగా భారం పడుతున్నప్పటికీ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ట్రాన్స్‌కో, జెన్కోల్లో కార్మికులు పని చేస్తున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికులపై ఆర్టిజన్ విధానం ద్వారా సవతి తల్లి ప్రేమ చూపించి వారిని వివక్షకు గురి చేస్తోందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. శాసనమండలి సమావేశాల్లో విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: న్యాయవాద దంపతుల హత్యలో తెరాస నేతల పాత్ర ఉంది: కాంగ్రెస్