కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని నాలుగు క్లస్టర్ గ్రామాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతువేదిక భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రామడుగు, రంగశాయిపల్లి, దేశరాజపల్లి, వెదిర గ్రామాల్లో రూ.80లక్షల వ్యయంతో రైతు వేదిక భవనాలు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే అర్హులైన రైతులందరూ కల్లాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. రైతులందరూ చర్చించుకుని భవిష్యత్తు పంటల ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకే వేదికలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రైతులందరూ లాభపడాలంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇవీ చూడండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు