కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూలీల కొరత తీర్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. ఇప్పటి వరకు అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా కూలీల కొరత ఉందని చెప్పారు. తూకం వేయడం, ధాన్యాన్ని లారీల్లో తరలించేందుకు గతంలో బిహార్ కూలీలు పనిచేశారని, లాక్ డౌన్ మూలంగా స్థానిక కూలీలతో పనులు చేపట్టాలన్నారు.
అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. చొప్పదండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఆరు మండలాల ప్రజాప్రతినిధులు, వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్లు, సహకార సంఘాల ఛైర్మన్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కరోనా కలవరం... 858కి చేరిన కేసులు