ETV Bharat / state

'ఎడ్యూ బజార్'​ సైన్స్​ ప్రదర్శనలో మంత్రులు గంగుల, కొప్పుల - edu bazar science exhibition in chinthakunta

కరీంనగర్​లోని చింతకుంట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 'ఎడ్యూ బజార్'​ సైన్స్​ ప్రదర్శనను మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మేయర్​ సునీల్​ రావు​ సందర్శించారు. పాఠశాల స్థాయి నుంచే ఇలాంటి ప్రతిభా ప్రదర్శనలు చేపడితే విద్యార్థుల్లో నైపుణ్యత పెరుగుతుందని మంత్రి గంగుల సూచించారు.

edu bazar science exhibition
ఎడ్యూ బజార్​ సైన్స్​ ప్రదర్శన
author img

By

Published : Feb 20, 2021, 7:10 PM IST

Updated : Feb 20, 2021, 7:43 PM IST

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ నెలకొల్పిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు.. విద్యార్థులను అందిపుచ్చుకుంటున్నాయని మంత్రులు​ గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని చింతకుంట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 'ఎడ్యూ బజార్'​ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు సైన్స్‌ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

సైన్స్​ ప్రదర్శనను మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్, మేయర్ సునీల్‌ రావు సందర్శించారు. పాఠశాల స్థాయి నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంతో విద్యార్థుల్లో నైపుణ్యత పెరుగుతుందని.. విద్యార్థులు నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని మంత్రి గంగుల సూచించారు. ఇటువంటి ప్రదర్శనను నిర్వహించినందుకు ఉపాధ్యాయులకు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: 300మంది లాయర్లతో రేపు గుంజపడుగులో బండి పర్యటన

Last Updated : Feb 20, 2021, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.