రైతులు దిగుబడులకే కాకుండా మనిషి ప్రాణాలకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సిర్సాపల్లిలో వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన రోటరీ మల్చింగ్ యంత్ర ప్రదర్శనలో పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.
రైతులు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారని దీనితో వాతావరణ కాలుష్యం పెరిగేందుకు ఆస్కారం ఉందని చెప్పారు. వరి పంట కోసిన తర్వాత కొయ్యలు కాల్చే అలవాటు ఉందని.. ఇది చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు. పంజాబ్‌లో ఇలా రైతులు కాల్చినందు వల్లనే దిల్లీ పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యిందని గుర్తు చేశారు. ఇలా కొయ్యలు కాలబెట్టకుండా ఈ యంత్రం ద్వారా దున్ని వాటిని మురగబెడితే పంటకు ఎరువుగా ఉపయోగపడుతుందని సూచించారు.
- ఇవీ చూడండి: తెలంగాణలో జలాశయాల సామర్థ్యం 878 టీఎంసీలు..