Minister gangula on kalyana laxmi:
రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ నిధులకు కొరత లేదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 10లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సాయం అందించామని వెల్లడించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఆలస్యంపై శాసనసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి గంగుల సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు 10 లక్షల 26వేలకు పైగా లబ్ధి పొందారని పేర్కొన్నారు.
కల్యాణ లక్ష్మి పెళ్లి రోజే ఇస్తే బాగుండు అనే ప్రశ్నను శాసనసభ్యులు రేఖా నాయక్ అడిగారు. దీనికి మంత్రి గంగుల సమాధానమిచ్చారు. కల్యాణ లక్ష్మి పెళ్లి రోజే ఇవ్వాలనేదే కేసీఆర్ ఆలోచన అని స్పష్టం చేశారు. పెళ్లి కార్డును 15 రోజుల ముందే ప్రింట్ చేసుకుని.. అప్లై చేసుకోవాలని సూచించారు. అలా చేస్తే... 15 రోజుల్లోపే.. పెళ్లి రోజే కల్యాణ లక్ష్మి వస్తుందని మంత్రి వెల్లడించారు. కల్యాణ లక్ష్మి ఇప్పుట్లో పెంచే అవకాముందా అని శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు.. ఇప్పటికే చాలా పెంచినట్లు మంత్రి సమాధానమిచ్చారు.
కల్యాణ లక్ష్మికి, షాదీ ముబారక్‌కు నిధుల కొరత లేదు. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా లబ్ధి పొందారు. కల్యాణ లక్ష్మి పెళ్లి రోజే ఇవ్వాలనేది కేసీఆర్ ఆలోచన.. జాప్యం అప్లై చేసుకునే విధానంలోనే జరుగుతోంది. కల్యాణ లక్ష్మి 15 రోజుల ముందే అప్లై చేసుకుంటే.. పెళ్లి రోజుకల్లా... చెక్ అందుతుంది.
- మంత్రి గంగుల కమలాకర్