పేదలకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం వరం లాంటిదని బీసీ సంక్షేమ,పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో 45 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. 2015 సంవత్సరం నుంచి ఇప్పటివరకు సుమారుగా 5,000 మందికి చెక్కులు అందించామని గుర్తు చేసుకున్నారు. ఎంత ఆర్థిక మాంద్యం ఉన్నా పేదలకు ఇచ్చే పథకాల్లో మాత్రం ప్రభుత్వం కోతలు పెట్టడం లేదని మంత్రి గంగుల వివరించారు. దాదాపు రూ.45లక్షల చెక్కులను మంత్రి లబ్దిదారులకు పంపిణీ చేశారు.
ప్రభుత్వ పథకాల్లో కోతలు లేవు: గంగుల
ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నా ప్రభుత్వ పథకాల్లో మాత్రం కోతలు విధించడం లేదని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపీణి కార్యక్రమంలో లబ్దిదారులుకు చెక్కులు పంపిణీ చేశారు.