కరోనా తీవ్రత పెరుగుతున్నందున... విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్లకే పరిమితమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కరీంనగర్‌లోని కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఇటీవల కరోనా పాజిటీవ్ ఉన్న ఇండోనేషియాకు చెందిన ఓ బృందం కరీంనగర్‌లో పర్యటించిన నేపథ్యంలో... పట్టణంలో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెండో రోజు జరిపిన పరీక్షల్లో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు అనుమానితులను గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. చేతులకు స్టాంపింగ్ చేసిన వారు బయటకు వస్తే సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు.