కరీంనగర్‌లో వలస కార్మికులను తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. నగర పరిసరాల్లో గ్రానైట్, మగ్గం, హోటల్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వలస కూలీల పేర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. ప్రతిరోజు దాదాపు 120 కార్మికుల పేర్లను నమోదు చేస్తున్నారు. నగరంలో దాదాపు 1000 మంది వరకు వలస కూలీలుండగా పనులు లేకపోవడం స్వగ్రామాలకు పయనమవుతున్నారు.
ప్రస్తుతం లాక్‌డౌన్ ముగిసి పనులు ప్రారంభమవుతాయని నచ్చ చెప్తున్నా... వారు మాత్రం తమ గ్రామాలకు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారని అధికారులు చెప్పారు. కరీంనగర్‌లో వలస కార్మికుల పరిస్థితి, పేర్ల నమోదు ప్రక్రియపై మరింత సమాచారాన్ని ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు.
ఇదీ చూడండి: హైదరాబాద్లో అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్