కరీంనగర్ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని మేయర్ సునీల్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని 16వ డివిజన్లో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్‌తో కలిసి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా కాలనీకి వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉన్నందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్పొరేటర్ సునీల్‌రావు దృష్టికి తీసుకురాగా.. రోడ్లు విస్తరించే పనులు చేపడుతున్నామని.. త్వరలోనే 16వ డివిజన్‌లోనూ చేపడతామని తెలిపారు. నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఎండాకాలం సమీపిస్తున్న దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి: సోలార్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తినష్టం!