ETV Bharat / state

బ్లాక్​ ప్లాంటేషన్​పై ప్రత్యేక దృష్టి సారించండి: మేయర్​ - latest news of karimnagar

బ్లాక్​ ప్లాంటేషన్​ కోసం స్థలాన్ని గుర్తించి.. వాటిన చదును చేసి... గుంతలు తవ్వించాలని ఇంజినీరింగ్ అధికారులకు కరీంనగర్​ మేయర్ సునీల్ రావు, కమిషనర్ క్రాంతి ఆదేశాలు జారీ చేశారు. మొక్కలు నాటేందుకు నగరంలోని ఐటీ టవర్​ వద్ద క్రీడా పాఠశాల గ్రౌండ్​ను వారు పరిశీలించారు.

Mayor Sunil Rao find suitable places for planting in karimnagar
బ్లాక్​ ప్లాంటేషన్​పై ప్రత్యేక దృష్టి సారించండి: మేయర్​
author img

By

Published : Jun 30, 2020, 8:00 PM IST

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్​లోని ఐటీ టవర్ వద్ద ఉన్న క్రీడా పాఠశాల గ్రౌండ్​ను నగర మేయర్​ సునీల్​రావు, కమిషనర్​ క్రాంతి సందర్శించారు. క్రీడా పాఠశాల గ్రౌండ్​లో పర్యటించి... మొక్కలు నాటేందుకు గల అనువైన స్థలాన్ని వారు పరిశీలించారు.

బ్లాక్ ప్లాంటేషన్ చేసేందుకు స్థలాన్ని గుర్తించి... చదును చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ ప్లాంటేషన్ పై అధికారులు దృష్టి సారించి... వాటి కోసం సరిపడా స్థలాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మేయర్​ అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.