ETV Bharat / state

Petrol price: కలెక్టరేట్ ఎదుట వామపక్ష నాయకుల ఆందోళన  - పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆందోళన

కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

left parties protest infront of karimnagar collectorate
కలెక్టరేట్ ఎదుట వామపక్ష నాయకుల ఆందోళన 
author img

By

Published : Jun 19, 2021, 4:14 PM IST

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్​ కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్ష నాయకులు నిరసన చేశారు. ముందుగా బస్టాండ్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కరోనా సమయంలో తినేందుకు తిండిలేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే సాయం చేయాల్సిందిపోయి... పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.