ETV Bharat / state

'మేము కన్నేస్తే... ప్రభుత్వ భూమైనా మాదే అవుతుంది'

author img

By

Published : Aug 9, 2020, 12:17 PM IST

కరీంనగర్‌ శివారు ప్రాంతాల్లో భూ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల శిఖం భూములను కబ్జా చేస్తూ... రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల అధికారులతోపాటు... కొందరు ప్రజాప్రతినిధుల అండదండలు భూ కబ్జాదారులకు ఉన్నట్లు విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

land mafia problems at bommakal in karimangar distrcit
'మేము కన్నేస్తే... ప్రభుత్వ భూమైనా మాదే అవుతుంది'

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోనే ఉన్నప్పటికీ బొమ్మకల్ గ్రామం... ప్రత్యేక పంచాయతీగా కొనసాగుతోంది. దీంతో పంచాయతీ పరిధిలోని భూములకు ఎనలేని డిమాండ్ పెరిగింది. ధరలు మంచిగా పలకుతున్న నేపథ్యంలో... భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. అధికారుల అండదండలతో... పట్టా భూములతోపాటు... ప్రభుత్వ భూములను సైతం కబ్జా చేస్తున్నారు.

ఫిర్యాదులు వస్తున్నా...

తమ భూములు దళారులు కబ్జా చేస్తున్నారనే ఫిర్యాదులు కలెక్టర్‌కు అందుతున్నప్పటికీ... వాటికి పరిష్కారం దొరకడం లేకుండా పోతుంది. అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగుతున్నా న్యాయం జరగడం లేదని బాధితులు వాపోతున్నారు. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం, మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో అధికారులు విచారణకు శ్రీకారం చుట్టారు.

గ్రామ సర్పంచ్​దే...

బొమ్మకల్​ గ్రామ సర్పంచ్ పుర్మల్ల శ్రీనివాస్‌ సైతం అడ్డదారులు తొక్కుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. భూ యజమానిని బెదిరించి... వారి భూములు మరొకరికి ధారాదత్తం చేయడంలో సర్పంచ్ కీలకపాత్ర పోషించారని భూ యజమానులు వ్యాఖ్యానిస్తున్నారు. భూ కబ్జాలు శృతి మించడంతో బాధితులంతా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో సర్పంచ్​ను అరెస్ట్‌ చేసి... లోతైనా విచారణకు అధికారులు రంగంలోకి దిగారు. భారీ ఎత్తున నకిలీ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రత్యేక బృందాలు

కలెక్టర్ శశాంక ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేసి... గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములపై సర్వేకు ఆదేశించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న 12 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. బొమ్మకల్​తో పాటు... సీతారాంపూర్, వివిధ గ్రామాలలో భూముల కబ్జాలు కొనసాగుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రభుత్వ భూములతో పాటు తమ భూములను సర్వే చేయాలని భూ యజమానులు కోరుతున్నారు. విచారణ జరిపించడమే కాకుండా... కబ్జాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి...న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: జూరాలకు పోటెత్తిన కృష్ణమ్మ... కొనసాగుతోన్న గోదావరి జలాల ఎత్తిపోత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.