హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి పార్టీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. భాజపా కూడా ఎలా అయినా ఎన్నికలో గెలవాలని ప్రయత్నిస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ భాజపా తరఫున బరిలోకి దిగి.. తన సత్తా మరోసారి చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్ నియోజకవర్గంలోని బూజునూరులో ఈటలతో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. గ్రామాల్లోని ఓటర్లను కలుసుకున్నారు. దళితబంధుపై తెరాస అసత్య ప్రచారాలు చేస్తోందని కిషన్ ఆరోపించారు.
దళితబంధుపై తెరాస అసత్యప్రచారాలు చేస్తోంది. ఎన్నికలైన మరుసటి రోజే... రాష్ట్రంలోని ఎస్సీలందరికీ దళితబంధు అమలు చేస్తారా? ప్రతి దళితునికి రూ.10 లక్షలు ఇస్తారా? ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్‌తో భాజపా పొత్తు పెట్టుకోదు. తెరాసనే కాంగ్రెస్‌తో కలిసి పొత్తు పెట్టుకుంటోంది. ఎన్నికల్లో అబద్ధాలు మీద అబద్ధాలు ఆడటం కేసీఆర్ కుటుంబానికే చెల్లుతోంది. కేసీఆర్ మాట మీద నిలబెట్టుకునే వ్యక్తి కాదు... మడమ తిప్పే వ్యక్తి.
-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డితో కలిసి ప్రచారం చేసిన ఈటల రాజేందర్... దళితబంధు మీద కలెక్టర్లు, బ్యాంకుల పెత్తనం కాకుండా... లబ్ధిదారులకే ఉండాలని ఈటల డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: Huzurabad by elections 2021: హుజూరాబాద్ ఎన్నికల్లో ఎన్నికోట్లు స్వాధీనం చేసుకున్నారంటే..