కరీంనగర్ నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా వల్లూరి క్రాంతి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన క్రాంతి గతంలో మహబూబ్‌నగర్, నిర్మల్ జిల్లాలో శిక్షణతో పాటు ప్రత్యేక అధికారిగా విధులు నిర్వర్తించారు. కార్పోరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను నిజమైన లబ్ధిదారులకు అందించడమే ధ్యేయంగా పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా చేపడుతున్న పనులను మరింత వేగవంతం చేసేందకు తన వంతు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తానని క్రాంతి వివరించారు.
ఇదీ చదవండిః భారీగా ఐఏఎస్‌ల బదిలీలు... కొత్త పోస్టింగ్‌లు ఇవే...