ETV Bharat / state

పుట్​పాత్​లు ఆక్రమిస్తే కఠిన చర్యలు: సునీల్​ రావు

నగరంలో పుట్​పాత్​లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ మేయర్​ సునీల్​ రావు హెచ్చరించారు. స్మార్ట్ సిటీలో భాగంగా రహదారుల పక్కన నిర్మించిన నడకదారులను నగరపాలక కమిషనర్​ వల్లూరు క్రాంతి, మేయర్​ పరిశీలించారు.

karimnagar municipal commissioner kranthi, mayor sunil rao inspected on footpaths in city
పుట్​పాత్​లను పరిశీలిస్తున్న నగరపాలక కమిషనర్​ వల్లూరు క్రాంతి
author img

By

Published : Feb 25, 2021, 3:38 PM IST

నగరంలోని రహదారుల పక్కన నిర్మించిన పాదచారుల బాటను ఆక్రమిస్తే ఇక నుంచి బాదుడు తప్పదని కరీంనగర్​ మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని గీతాభవన్ చౌరస్తా నుంచి కరీంనగర్ డెయిరీ వరకు ఆక్రమించిన పాదచారుల నడకదారులను ఖాళీ చేయాలని మేయర్ వ్యాపారస్తులను కోరారు.

మూడు రోజుల పాటు క్యాంపు నిర్వహించి అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. వ్యాపారస్తులు సహకరించపోతే ఆన్​లైన్​లో అపరాధ రుసుము వసూలు చేయడానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన వెల్లడించాకరు. ఇప్పటికైనా దుకాణ యజమానులు నగరపాలక సంస్థ నియమాలను పాటించాలని సునీల్ రావు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : 'ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.