కరీనంగర్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని పట్టణ మేయర్ సునీల్ రావు తెలిపారు. ఎలాంటి అవినీతి లేకుండా ఆటంకంలేని అభివృద్ధి చేసి నిరూపిస్తానని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్‌గా తెరాసకు చెందిన సునీల్‌రావు ఏకగ్రీవం కాగా.. డిప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూపరాణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకముందు ఎన్నికల్లో గెలిచిన కొత్త కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మేయర్ ఎన్నిక చేపట్టారు.
కరీంనగర్ నగర పాలక సంస్థలో మొత్తం 60 డివిజన్లు ఉండగా... తెరాస 33 స్థానాలు గెలుచుకుంది. ఏడుగురు స్వతంత్రులు చేరడంతో.. అధికార పార్టీ బలం 40స్థానాలకు పెరిగింది. కరీంనగర్ మేయర్‌గా ఎన్నికైన సునీల్ రావు, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన చల్లా స్వరూపరాణిని మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు.
ఇవీ చూడండి:తెరాస పతనం తుక్కుగూడ నుంచే: లక్ష్మణ్