పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 'ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు' కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్‌రావు పాల్గొన్నారు. కమిషనర్ క్రాంతితో కలిసి స్థానిక జ్యోతినగర్‌లో ఇంటింటికి తిరుగుతూ నిల్వ ఉన్న నీటిని తొలగించారు. దోమల వ్యాప్తి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
డెంగ్యూ దోమలు మురుగు నీటిలో కాకుండా మంచినీటి పైనే ఉంటాయని అందరూ గ్రహించాలని ఆయన తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని... బయటకు వస్తే మాస్కులు ధరించాలన్నారు.
ఇవీ చూడండి: అమ్మా.. నీ మనసు వెన్న...