కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగాలను కలెక్టర్ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ ఫైల్స్ ఉండకుండా సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్లోని అన్ని కార్యాలయాల్లో స్త్రీ,పురుషుల ఉద్యోగుల వివరాలు సేకరించి వారికి సరిపడా టాయిలెట్లు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మహిళా ఉద్యోగులకు ఫీడింగ్ రూం ఏర్పాటు చేయాలని తెలిపారు.
రికార్డు రూంలో ఉన్న పురాతన రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని కలెక్టర్ శశాకం అధికారులను ఆదేశించారు. సూపరింటెండెంట్ల విభాగాలు ఆధునీకరించి, సీసీ కెమెరాలు సరిగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించి జిల్లా రెవెన్యూ అధికారి, ఏఓలు పరిశీలించడానికి మానిటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
- ఇవీ చూడండి: 'ఇలా చదువు చెప్తే పిల్లలు ఎలా పోటీనిస్తారు?'