ETV Bharat / state

కరీంనగర్​ డిపోలో మొక్కలు నాటిన రీజనల్​ మేనేజర్​ - హరితహారం వార్తలు

పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కరీంనగర్​ ఉమ్మడి జిల్లా ఆర్టీసీ రీజనల్​ మేనేజర్​ జీవన్​ ప్రసాద్​ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రెండవ డిపోలో ఏర్పాటు చేసిన హరితహారంలో ఆయన పాల్గొన్నారు.

Karima Nagar RTC Regional Manager Participated In Haritha Haram
కరీంనగర్​ డిపోలో మొక్కలు నాటిన రీజనల్​ మేనేజర్​
author img

By

Published : Jun 27, 2020, 12:49 PM IST

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని రెండవ డిపోలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని రెండు డిపోల పరిధిలోని ఆర్టీసీ సిబ్బంది హరితహారంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి జిల్లా ఆర్టీసీ రీజనల్​ మేనేజర్​ జీవన్​ ప్రసాద్​ బస్టాండ్​ ఆవరణలో మొక్కలు నాటారు.

కరీంనగర్​ రీజియన్​ పరిధిలోని బస్టాండ్​ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో ఐదువేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో పౌరులందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా.. వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని కోరారు.

ఇవీచూడండి: గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.