ETV Bharat / state

VIRAL: కేసీఆర్​కు ఈటల రాజేందర్ లేఖ రాశారా.. తన తప్పును క్షమించాలని కోరారా ? - bjp leader etela news

గత కొన్నాళ్లుగా అందరి నోటా నానుతున్న ఈటల రాజేందర్​ పేరు... మరోసారి వైరల్​ అవుతోంది. వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈటల ఉన్న రోజుల్లో.. ఆయన లెటర్​ ప్యాడ్​పై రాసినట్లుగా ఉన్న ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. తాను చేసింది తప్పేనని.. తమ్ముడిలా భావించి క్షమించాలని.. తప్పును సరిదిద్దుకొనేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ.. కేసీఆర్​ను ఈటల కోరినట్లు ఆ లేఖలో ఉంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. నిజంగా ఈ లేఖ ఈటలే రాశారా..

ETELA LETTER VIRAL
ETELA LETTER VIRAL
author img

By

Published : Jun 25, 2021, 6:05 PM IST

తాను చేసింది తప్పేనని.. పెద్ద మనసుతో క్షమించాలని.. పార్టీకి నష్టం కలిగించే పనులు ఇంకోసారి చేయనని.. ఇదే విషయం అసెంబ్లీలో రామ్​కు చెప్పానని.. అంటూ ఈటల రాజేందర్​.. ముఖ్యమంత్రికి రాసినట్లుగా ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

అయితే ఈటల రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న లేఖలో ఏముంది..

ETELA LETTER VIRAL
ఈటల రాసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్న లేఖ ఇదే..

'తెరాసలో గత 20 ఏళ్లుగా మీతో సాన్నిహిత్యం చాలా గొప్పది. మీతో పనిచేసిన ప్రతిక్షణం నేను రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నాను. మీరు పార్టీలో నా స్థాయికి మించి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఆ విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది. మీరిచ్చిన అవకాశాలతో హుజూరాబాద్​ ఎమ్మెల్యేగా గెలిచాను.. నాకు అదే పెద్ద పదవని అనుకున్నాను.. కానీ ఎందరినో కాదని.. తెరాస శాసనసభ పక్ష నేతగా నాకు అవకాశం కల్పించారు. ఆ ప్రోత్సాహాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఉద్యమ సమయం నుంచి వేలు పట్టి నడిపించారు. గత ఇరవై ఏళ్లుగా సొంత తమ్ముడిలా భావిస్తూ వస్తున్నారు. మీరు అవకాశం ఇవ్వకుంటే నేను ఇంతటి వాడిని అయ్యేవాడిని కాదు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తగిన గుర్తింపు ఇచ్చారు. రెండు సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చారు.

'బెంగళూరు, పూణే సమావేశాలకు అందుకే వెళ్లాను..'

కానీ నిన్నటి నుంచి జరిగిన పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. నాపై వచ్చిన ఆరోపణలు కొన్ని ఛానళ్లలో రావడం తీవ్రంగా బాధించింది. నేను చేసిన కొన్ని పనులు తప్పే కావొచ్చు. కానీ ఈ పనులు కొందరు తప్పుదోవ పట్టించడం వల్ల చేయాల్సి వచ్చిందే కానీ.. పార్టీ, మీ మీద ఎల్లప్పుడూ అపార గౌరవం ఉంది. బెంగళూరు, పూణేలో సమావేశాలకు కూడా కొందరు తప్పుదోవ పట్టించడం వల్లనే వెళ్లాల్సి వచ్చింది. తప్పితే నాకు ఇతర ఆలోచనలు ఏమీ లేవు. అలా సమావేశాలు పెట్టడం, పార్టీకి ఇబ్బంది కలిగేలా కొన్ని రకాల పనులు చేయడం మూమ్మాటికీ తప్పేనని ఒప్పుకుంటున్నాను. నన్ను మరోసారి తమ్ముడిలా భావించి.. తప్పును సరిదిద్దుకొనే అవకాశం ఇవ్వగలరు. జరిగిన పరిణామాల పట్ల నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇక నుంచి అలాంటి తప్పులను గానీ.. పార్టీకి ఇబ్బంది కలిగించే ఎలాంటి పనులు చేయనని మీకు మాట ఇస్తున్నాను.

'రామ్​తో అదే చెప్పాను..'

నాతో పాటు పార్టీకి ఇబ్బంది కలిగించే అలాంటి సమావేశాల్లో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా సహా ఇతర జిల్లాల నేతలూ పార్టీకి విధేయంగా ఉండేలా చూస్తాను.. మీరు నా తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ ఒక్క అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. పదవులతో సంబంధం లేకుండా పార్టీని మరింత బలోపేతం చేయడానికి నేను అనుక్షణం సిద్ధంగా ఉంటాను. ఇదే విషయం రామ్​(కేటీఆర్​)తో అసెంబ్లీలో కలిసినప్పుడు చెప్పారు. ఆనాడు చెప్పిన దానికి ముమ్మాటికీ కట్టుబడి ఉంటాను. అంటూ ఈటల రాసినట్లుగా ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

ఏం జరిగింది...

వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటలపై కొందరు రైతుల ఫిర్యాదుపై సీఎం కేసీఆర్​ చర్యలు తీసుకున్నారు. తొలుత విచారణకు ఆదేశించడం, వైద్యారోగ్యశాఖను సీఎం తీసుకోవడం, మంత్రి పదవి నుంచి భర్తరఫ్​ చేయడం కొద్దిరోజుల్లోనే జరిగిపోయాయి. తనను కావాలనే తప్పించారంటూ.. కేసీఆర్​పై.. ఈటల రాజేందర్​ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతర పరిణామాల నేపథ్యంలో కమలం గూటికి చేరారు.. ఈటల రాజేందర్​.

ETELA LETTER VIRAL
పోలీసులకు ఈటల అనుచరుల ఫిర్యాదు

పోలీసులకు ఈటల అనుచరుల ఫిర్యాదు..

అయితే ఈ లేఖ ఈటల రాజేందర్​ స్వయంగా రాశారా.. లేక ఎవరైనా కావాలనే చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఈటల రాజేందర్​ అనుచరులు మాత్రం.. తమ నేత ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం సహా రాజకీయంగా దెబ్బతీసేవిధంగా ఈ లేఖ ఉందని మండిపడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేఖ తయారుచేసిన వారిపై, వాట్సాప్​ గ్రూపుల్లో ప్రచారం చేసిన మాడ సాధవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. వీణవంక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.