పోలీసు సిబ్బంది కృషి, నిఘా నేత్రాల పర్యవేక్షణతో వందశాతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని హుజూరాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస రావు అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ఆముదాలపల్లిలో దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఏసీపీ ముఖ్య అతిథిగా హాజరై వాటిని ప్రారంభించారు.
నేరాల నియంత్రణకు నిఘా నేత్రాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు. గ్రామాల్లో నేరాలు-ఘోరాలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. సీసీ కెమెరాల సాయంతో ఎన్నో కేసులను చేధించామని ఆయన అన్నారు. వీధివీధినా ఏర్పాటు చేసుకునేలా గ్రామస్థులు, వ్యాపారులను ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలని ఏసీపీ కోరారు.
ఇవీ చూడండి: ఆన్లైన్ పాఠాలకు... స్మార్ట్‌సిటీకి విద్యుత్ కోతలు