ETV Bharat / state

కల్తీ నూనె తయారీ కేంద్రంలో తనిఖీలు

కరీంనగర్​ జిల్లా మానుకొండూరులో వంటనూనె, ఇతర పదార్థాలను అక్రమంగా తయారు చేసి విక్రయిస్తున్న దాబాపై పోలీసులు కొరడా ఝళిపించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకొని.. అక్కడ సేకరించిన నూనెలు, ఆహార పదార్థాల నమూనాను హైదరాబాద్ ల్యాబ్​కి తరలించారు.

Inspections of police at adulteration oil plant in karimnagar
కల్తీ నూనె తయారీ కేంద్రంలో తనిఖీలు
author img

By

Published : Feb 11, 2020, 12:54 PM IST

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని చెంజర్ల గ్రామ శివారులో ఫౌజీ దాబాలో కల్తీ వంటనూనె తయారీ దారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా నాణ్యతలేని నూనె తయారు చేసి చుట్టు పక్కల దాబాలకు సప్లై చేస్తున్నారన్న పక్కా సమాచారంతో సీఐ సంతోష్ కుమార్ ఫుడ్ ఇన్​స్పెక్టర్​తో కలిసి తనిఖీలు నిర్వహించారు.

ఓ ఆయిల్​ కంపెనీకి సరఫరా చేస్తున్న ముడి నూనెను లారీ డ్రైవర్ నుంచి అక్రమంగా కొనుగోలు చేసి దాబాలో ఆహార పదార్థాల తయారీకి ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు. నూనెలను, ఆహార పదార్థాల శాంపిల్ తీసి నమూనాలను హైదరాబాద్ ల్యాబ్ తరలిస్తున్నట్లు వెల్లడించారు.

నమూనాలో వచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. గత ఎనిమిదేళ్ల నుంచి ఇక్కడ అక్రమ నూనె తయారుచేస్తున్నారు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

కల్తీ నూనె తయారీ కేంద్రంలో తనిఖీలు

ఇదీచూడండి: డెలివరీ బాయ్​పై దాడి.. ముగ్గురి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.