ETV Bharat / state

ఖజానాకు గండి: ఇసుక అక్రమ దందా.. ఆగేదెన్నడు? - ఇసుక మాఫియా తాజా వార్త

కరీంనగర్​ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.. నిత్యం తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ ఖజానా నింపాల్సిన సంబంధిత శాఖలు సమన్వయంతో ముందడుగు వేయలేకపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 24 గంటలు యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. నగరాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇన్నీ జరుగుతున్నా మైనింగ్‌, రెవెన్యూ, పోలీసులు శాఖలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయి. అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్ల మోతతో నిద్ర పట్టడం లేదని, రవాణాను అదుపు చేయాలని పలు గ్రామాల నుంచి యువత ఫోన్ల ద్వారా ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన కరవవుతోంది.

illegal transportation of sand in karimnagar district
ఖజానాకు గండి: ఇసుక అక్రమ దందా.. ఆగేదెన్నడు?
author img

By

Published : Nov 10, 2020, 2:24 PM IST

కరీంనగర్​ జిల్లాలో మానేరు నదితో పాటు పలు మండలాల మీదుగా వాగులు పారుతున్నాయి. అయిననూ ప్రవాహంలోని ఇసుకను తీసి పట్టణాలకు తరలించి ఒక్కో ట్రిప్పునకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు అమ్ముతున్నారు. ఇంచుమించుగా జిల్లా వ్యాప్తంగా నిత్యం 4 వందల నుంచి 5 వందల ట్రాక్టర్‌ ట్రిప్పుల వరకు అక్రమ రవాణా జరుగుతున్నట్లు అంచనా. రీచ్‌ల నుంచి టోకెన్‌ ద్వారా తీసుకెళ్లే ఇసుకకు చెల్లించే పన్ను కిలో మీటరు ప్రాతిపదికన ఉంటుంది. తక్కువలో తక్కువ రూ.1150 దగ్గర ప్రారంభమై రూ.2500 వందల వరకు ఉంటుంది. ఈలెక్కన ఒక్కో ట్రిప్పునకు సగటున రూ.2వేల చొప్పున లెక్కేస్తే 500 ట్రిప్పులకు నిత్యం రూ.10 లక్షల వరకు ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది.

కొందరు ట్రాక్టర్‌ యజమానులు ఇద్దరు డ్రైవర్లను నియమించుకుని 24గంటల పాటు రవాణా కొనసాగిస్తూ ఆరు ట్రిప్పులు విక్రయిస్తున్నారు. శిక్షణ లేని డ్రైవర్లు ఉండటం వల్ల ఇష్టారీతిన నడుపుతూ గ్రామీణులను భయపెడుతున్నారు. ఇటీవల బొమ్మకల్‌లో ఓ ఇంటి గోడను ట్రాక్టరు ఢీకొనడం వల్ల డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గుట్టుచప్పుడు కాకుండా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవడం వల్ల వాగులు వంకల్లో నీరు పారుతోంది. ఇసుక మేట కనిపిస్తే చాలు అక్కడి నుంచి తోడి తరలిస్తున్నారు.

జమ్మికుంట మండలం తనుగుల మానేరు వాగు నుంచి ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు

అభివృద్ధి పనుల పేరు చెప్పి అక్రమ రవాణా

శ్మశానవాటిక, డంపింగ్‌యార్డుల నిర్మాణాలకని చెప్పి ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఎవరైనా అధికారి వచ్చి ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకుంటే సంబంధిత యజమాని గ్రామంలోని ప్రజాప్రతినిధి ద్వారా డంపింగ్‌యార్డు నిర్మాణానికని ఫోన్‌ చేయించి తప్పించుకుంటున్నారు.

బొమ్మకల్‌లో మానేరు వాగు నుంచి ఉదయం వేళ ట్రాక్టర్‌ ద్వారా ఇసుకను తరలిస్తున్న దృశ్యం

* గన్నేరువరం మండలంలో బిక్కవాగు నుంచి 24 గంటలూ ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. గంగాధర మండలంలోని వెంకటయ్యపల్లి వాగు నుంచి ఇసుక తరలించుకుపోతున్నా అక్కడ అడిగే దిక్కే లేదూ. కొత్తపల్లి, తిమ్మాపూర్‌ మండలాల్లో మొన్నటి వరకూ ఇసుకను హైదరాబాద్‌కు తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇటీవల మానేరు బ్యాకు వాటర్‌ నిలువ ఉండటం వల్ల.. ఇసుక అక్రమ రవాణాకు కొంత బ్రేక్‌ పడినట్లయింది.

* జమ్మికుంట మండలంలోని విలాసాగర్‌, తనుగుల, వీణవంక మండలం పోతిరెడ్డిపేట నుంచి మానేరు వాగు నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లు ఇసుకను జమ్మికుంట, హన్మకొండకు తరలిస్తూ ఉంటారు. జమ్మికుంటలో రూ.3వేలు, హన్మకొండలో రూ.5 వేలకు అమ్ముకొని ఇసుకాసురులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇసుక ట్రాక్టర్లు అతివేగంగా వెళ్లే క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సందర్భాలూ ఉన్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులకు సైతం వెనుకాడటం లేదు.

* మానేరు పరివాహక ప్రాంత గ్రామాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఇసుక అక్రమ రవాణా మారింది. కరీంనగర్‌ రూరల్‌ మండలం బొమ్మకల్‌, చేగుర్తిలో ఇంచుమించుగా 200 ట్రాక్టర్లు ఉన్నాయి. బొమ్మకల్‌లో ఇసుక రీచ్‌ ఉన్నప్పటికీ సమయానుకూలంగా ఇసుక నడిచే ట్రాక్టర్లు నామమాత్రమే. రాత్రి వేళల్లోనే జోరుగా సాగుతోంది. ఇరుకుల్ల వాగు నుంచి 24 గంటలు ఇసుకను తరలిస్తూనే ఉంటారు. గ్రామంలోని పలువురు యువకులు అధికారులకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేసినా రవాణా ఆగడం లేదని గ్రహించిన యువకులు సైతం ఇటీవలే ట్రాక్టర్లు కొని ఇసుక అక్రమ రవాణా వ్యాపారంలోకి అడుగిడారు. మానకొండూర్‌ మండలంలోని మానేరు నది తీరాన గల శ్రీనివాసనగర్‌, వెల్ది, లింగాపూర్‌లో 24 గంటలు 220 ట్రాక్టర్లతో ఇసుక రవాణా జరుగుతోంది.

* వీణవంక మండలంలో చల్లురూ, కోర్కల్‌లో రీచులు ఉన్నప్పటికీ రాత్రి వేళల్లో నిఘా లేక రవాణా చేస్తూ వాహన యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క చల్లూరులోనే 200 వందల ట్రాక్టర్ల వరకు ఉన్నాయంటే పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్ఛు.

బొమ్మకల్‌ గ్రామ శివారులో ఇసుక నిలువలు

చర్యలు చేపడతాం

టోకెన్‌ వచ్చిన తరువాతే వాగులోకి ట్రాక్టర్‌ వెళ్లి ఇసుక తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మాకు ఇటీవల కొన్ని ఫిర్యాదులు అందాయని కరీంనగర్‌ మైనింగ్‌ ఏడీఈ వెంకటేశం తెలిపారు. రాత్రిళ్లు సైతం ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, పటిష్ఠ నిఘాను ఏర్పాటు చేసి చర్యలు చేపడుతామని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రాజధానిలో నాలాల విస్తరణ.. సవాళ్లే అడుగడుగున!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.