వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పర్యటించారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. పండించిన పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామన్నారు. భాజపా నాయకులు స్థాయిని మించి మాట్లాడుతున్నారని తెలిపారు.
రైతుల కోసం తపన పడుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం.. మాకు ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు టచ్‌లో ఉన్నారంటూ భాజపా నాయకులు చెబుతున్నారు. కేంద్ర ప్రబుత్వం నల్లచట్టాలను తీసుకొచ్చి రైతులను నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే యూపీ, రాజస్థాన్, పంజాబ్‌కు చెందిన రైతులు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
ఇదీ చదవండి: సోమవారం నుంచి పాతపద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు