కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, మానకొండూరు, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల్లో గాంధీ జయంతి 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాలకవర్గాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ప్రజలు భారీగా హాజరయ్యారు. ప్రతి చోట మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. గన్నేరువరం మండలంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై పలు గ్రామాల్లో అవగాహన కల్పించారు. ఈ మేరకు గ్రామస్థులకు చేతి సంచులను అందజేశారు.
ఇవీ చూడండి: రేపు దిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్... ఎల్లుండి ప్రధానితో భేటీ..