ETV Bharat / state

'మాకు రోడ్డు వద్దు'... మాజీ స్పీకర్​ను అడ్డుకున్న రైతులు - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు

రహదారి విస్తరణ కోసం తమ భూములు ఇచ్చేది లేదంటూ రైతులు హుజురాబాద్​లో ఆందోళనకు దిగారు. తమకు నష్ట పరిహారం అవసరం లేదని స్పష్టం చేశారు. భూ సర్వేని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. అటుగా వెళ్తున్న మాజీ స్పీకర్ మధుసూదనాచారిని అడ్డుకున్నారు.

farmers protest for their land at huzurabad in karimnagar
హుజురాబాద్​లో ధర్నా... మాజీ స్పీకర్​ను అడ్డుకున్న రైతులు
author img

By

Published : Nov 25, 2020, 8:06 PM IST

రహదారి విస్తరణ కోసం తమ భూములు ఇవ్వబోమని జాతీయ రహదారిపై కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో రైతులు ధర్నాకు దిగారు. తమకు రోడ్డు అవసరం లేదని జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. భూ సర్వేను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. అటుగా వెళ్తున్న మాజీ స్పీకర్‌ మధుసూదనాచారిని అడ్డుకున్నారు. వాహనం వెళ్లకుండా రోడ్డుపై అడ్డంగా పడుకున్నారు.

భూములు ఇవ్వం...

కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారి 563 రోడ్డు పనుల విస్తరణలో భాగంగా అధికారులు భూ సర్వేను నిర్వహించారు. హుజూరాబాద్‌ మండలంలోని సింగాపూర్‌, కొత్తపల్లి, బోర్నపల్లి, రంగాపూర్‌, రాంపూర్‌, పెద్దపాపయ్యపల్లి, కందుగుల గ్రామాల్లోని పలు వ్యవసాయ భూముల్లో సర్వే నిర్వహించారు. తమ భూములను సర్వే చేయొద్దని, భూములు ఇచ్చేది లేదంటూ రైతులు హుజూరాబాద్‌ ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్డీవో‌, తహసీల్దార్‌ బావుసింగ్‌లతో మాట్లాడారు. సర్వేకు సహకరించాలని అధికారులు కోరగా... రైతులు ససేమిరా అన్నారు. సుమారు గంటపాటు చర్చలు జరిపినప్పటికీ రైతులు అంగీకరించలేదు.

మా భూములు మాకే...

తమకు ఎలాంటి నష్టపరిహారం అవసరం లేదని, తమ భూములు తమకే కావాలంటూ అన్నదాతలు డిమాండ్‌ చేశారు. కొందరు రైతులు పురుగుల మందు డబ్బాలను తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. అధికారుల నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవటంతో కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై బైఠాయించారు. తమ భూములు తమకే కావాలంటూ నినాదాలు చేశారు.

మాజీ స్పీకర్ జోక్యం...

కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న శాసనసభ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారిని రైతులు అడ్డుకున్నారు. వాహనం వెళ్లకుండా అడ్డంగా రోడ్డుపై పడుకున్నారు. పోలీసులు రైతులను పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన మాట ఇవ్వడంతో రైతులు తప్పుకున్నారు.

చివరకు...

సీఐ మాధవి సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. ఆర్డీవోతో మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: గేదెల మందను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.