కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ పర్యవేక్షించారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సామగ్రిని పంపిణీ చేశారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు సిబ్బందికి అందించారు. సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిరి ఏర్పాటు చేసి మంచినీరు, మజ్జిగ పంపిణీ చేశారు. కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.
ఇవీ చూడండి : సీఎం కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు