ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంత్రులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, వీణవంక, శంకరపట్నం మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో కోటి నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే... ఇంతవరకు 25శాతమైనా కొనుగోలు చేయలేదన్నారు.
కొనుగోళ్లపై కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు. బత్తాయి, నిమ్మ రైతులు పూర్తిగా నైరాశ్యంలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతులకు ఇప్పటి వరకు డబ్బు చెల్లించలేదన్నారు. ఎక్కువ కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు, టార్పాలిన్లు లేవని చెప్పారు. దీనికి తోడు కరీంనగర్ జిల్లాలో 40 కిలోలకు 2కిలోలు అదనంగా జోకమంటున్నారని... ఇది ఎవరి సొమ్మని ఇలా చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు: ఉత్తమ్