ETV Bharat / state

ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు: ఉత్తమ్​ - tpcc president uttamkumar

ధాన్యం కొనుగోళ్లలో తెరాస ప్రభుత్వం వైఫల్యం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆరోపించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోతుందని, కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్​చేశారు.

farmers facing many problems with govt failure
ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు: ఉత్తమ్​
author img

By

Published : May 8, 2020, 3:32 PM IST

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్​లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్​రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్​ కుమార్​లతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురవుతున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు.

ధాన్యం కొనుగోళ్లలో తెరాస ప్రభుత్వం వైఫల్యం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉత్తమ్​ ఆరోపించారు. ఛత్తీస్​గఢ్​లో బోనస్​తో కలిపి క్వింటాల్​ ధాన్యానికి రూ. 2500 ఇస్తుంటే.. రాష్ట్రంలో రూ.1835 ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. తాలు పేరిట మిల్లర్లు కోత విధిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని.. కొనుగోలు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. రైతుల పంట నష్టానికి సీఎం కేసీఆరే బాధ్యత వహించాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హమాలీల ఖర్చు ప్రభుత్వమే భరించి కొనుగోలు చేసేదన్న ఉత్తమ్​.. తెరాస ప్రభుత్వం రైతులపై భారాన్ని వేస్తుందని విమర్శించారు. కేసీఆర్ మాటలు చెప్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో చేతలు లేవని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు: ఉత్తమ్​

ఇదీచూడండి: లాక్​డౌన్ వేళ యథేచ్ఛగా రోడ్లపైకి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.