ETV Bharat / state

బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం: డీకే అరుణ - కరీంనగర్​లో బండి సంజయ్​ని కలిసిన డీకే అరుణ

కరీంనగర్​లో దీక్ష చేపట్టిన బండి సంజయ్​ను భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కలిశారు. సంజయ్​ అరెస్ట్ అప్రజాస్వామికమని విమర్శించారు. భాజపాను తెరాస ఎదుర్కోలేకనే బురద జల్లుతోందని ఆరోపించారు. దుబ్బాక ఎన్నికల్లో భాజపాదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.

dk aruna meet bandi sanjay in karimnagar
బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం: డీకే అరుణ
author img

By

Published : Oct 27, 2020, 2:34 PM IST

దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతోన్న ఎన్నికల ప్రచారం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. సిద్దిపేటలో బండి సంజయ్ అరెస్టు అప్రజాస్వామికమని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. భాజపాను తెరాస ఎదుర్కోలేకనే అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. కరీంనగర్​లో దీక్ష చేపట్టిన బండి సంజయ్​ను పరామర్శించారు.

దుబ్బాక ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధిస్తుందని డీకే అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుని నిరసిస్తూ కరీంనగర్​లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం: డీకే అరుణ

ఇదీ చదవండి: దుబ్బాకలో వేడెక్కిన రాజకీయం... రణరంగంగా సిద్దిపేట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.