భాజపా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది: చాడ వెంకట్ రెడ్డి భాజపా ప్రభుత్వము వివాదాస్పద బిల్లులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాచార హక్కులు తన గుప్పిట్లో ఉంచుకునేందుకు 35 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో భాజపా అధికారంలోకి వస్తుందని.. ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థ పాలన వైఫల్యం వల్లే భాజపా కి అవకాశం దొరుకుతుందన్నారు. ఇవీ చూడండి : 71గొర్రెలకు భార్యను ప్రియునికి అమ్మేసి మోసపోయాడు!