హుజూరాబాద్‌లో ఏ ఒక్క ప్రభుత్వ పథకాన్ని... తెరాస సర్కారుకు ఆపే అధికారం లేదని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్(etela rajender constituency) స్పష్టం చేశారు. కమలాపూర్ దళిత కాలనీలో... ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి... ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr news) వ్యవహరిస్తున్న తీరును వివరించారు. ప్రజలను ప్రేమతో ఓట్లు అడగాల్సింది పోయి... తెరాసకే ఓటు వేయాలని... ఆ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని ఈటల ఆరోపించారు.
నేను ఉండగా పింఛన్ పోదు, కార్డు పోదు. దళిత బంధు పోదు. చేనేత కార్మికుల హక్కులు పోవు. ఏవీ పోవు. అన్నిటికి బాధ్యత నాదే. రఘునందన్ గెలిసిండు. పోయినయా అక్కడ? ఇక్కడ ఎంపీగా బండి సంజయ్ గెలిసిండు... పోయినయా? అన్ని ఒట్టి మాటలే. దాన్ని నమ్ముతారా?. అంత అమాయకులా? కేసీఆర్ ఇంట్లో నుంచి ఇస్తున్నారా?.
-ఈటల రాజేందర్, భాజపా అభ్యర్థి
కరోనా కాలంలో భార్యాపిల్లలను పట్టించుకోకుండా ఆస్పత్రుల చుట్టూ తిరిగితే... సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో ఉండి తనపై కుట్రలు చేశారని ఈటల ఆరోపించారు. తాను డబ్బుకోసమో... పదవి కోసమో పోటీ చేయడం లేదని అన్నారు. కేవలం తెలంగాణ ప్రజల గౌరవం కోసమే పోరాడుతున్నానని పేర్కొన్నారు. పద్దెనిమిదేళ్లుగా కడుపులో పెట్టుకొని చూసుకున్న ప్రజలు... ఈసారి కూడా అదే ప్రేమ చూపాలని విజ్ఞప్తి చేశారు.
ఒక సామాన్య వ్యక్తి మీద వ్యవస్థ వ్యవస్థే... ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌లో కూర్చొని, హరీశ్ రావు సింగాపూర్‌లో కూర్చొని, ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు కూర్చొని దౌర్జన్యం చేస్తున్నారు. సాటి పౌరుడిగా దీన్ని అరికట్టగలికే శక్తి మీ చేతిలోనే ఉంది. కేసీఆర్ అహంకారం మీద జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మీరందరూ కూడా ఒకే మాట మీద నిలబడి, ఒకే ఆలోచనతో నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతున్నాను.
-ఈటల రాజేందర్, భాజపా అభ్యర్థి
అధికార పార్టీ నాయకులు రోజుకొక లేఖను సృష్టించి తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్(huzurabad bjp candidate etela rajender) ఇటీవలె విమర్శించారు. ఐదునెలలుగా అధికార పార్టీ కుట్రలపై పోరాడుతున్నానని తెలిపారు. పదవి పోతే ప్రజలు దూరమవుతారు కానీ.. నాకు మాత్రం దగ్గరయ్యారని పేర్కొన్నారు. నా రాజీనామా వల్లే హజూరాబాద్లోనే మొట్టమొదటిసారి దళితబంధు అమలవుతోందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆడబిడ్డలకు వడ్డీలేని రుణాలు అందుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలోని కనపర్తి, వల్భాపూర్, నర్సింగాపూర్, కొండపాక గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇవాళ కమలాపూర్‌లో ప్రచారంలో పాల్గొన్న ఈటల... తెరాసపై విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి: Srinivas Goud News: 'కేసీఆర్ అంటే జాతీయ పార్టీలకు అందుకే కోపం'