కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశ కార్యకర్తలు నిరసనకు దిగారు. కరోనా ఇన్సెంటివ్గా రూ. ఐదు వేలు, కనీస వేతనం కింద రూ. 21 వేలు, ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్లు రూ.వెయ్యి ఫిక్స్డ్ వేతనమివ్వాలని కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. కరోనా సమయంలో ప్రయాణ ఛార్జీలు, మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు ఇవ్వకుండా అనేక పనులకు వినియోగించుకుంటున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ ఆరోపించారు.
ప్రజా ఆరోగ్య వ్యవస్థ కోసం ప్రభుత్వాలు మాటలు, చప్పట్లు కాకుండా బడ్జెట్లో పది శాతం నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆశ కార్యకర్తలకు కనీస వేతనం, ఫిక్స్డ్ వేతనాలు ఇచ్చేవరకు పోరాడతామని వెల్లడించారు. వీరికి వేతనాలతో పాటు యూనిఫాంలు, జాబ్ చార్ట్ తదితర అంశాలను ఇవ్వాలంటూ డీఆర్వోకు వినతిపత్రాన్ని అందజేశారు.
ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల