ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని కరీంనగర్లో సిఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. గత ఐదు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సరిసమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం చూపుతోందని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని.. లేకుంటే అక్టోబర్ 14న హైదరాబాదులో ఇందిరా గార్డెన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బండారి శేఖర్ హెచ్చరించారు.
ఇవీ చూడండి: ప్రజాభిప్రాయాలకు ప్రతిబింబంగా అసెంబ్లీ..: మంత్రి ప్రశాంత్ రెడ్డి