ETV Bharat / state

'నా తప్పుంటే క్షమించండి.. కానీ నన్ను గుర్తించండి' - తెలంగాణ తాజా వార్తలు

పుణ్యానికి పోతే పాపం ఎదురైందన్న చందంగా... అవినీతిపై ఆరా తీసిన తాను కుల బహిష్కరణకు గురయ్యానని బాధితుడు వాపోతున్నాడు. నాలుగేళ్ల క్రితం తనను కులబహిష్కర చేసి కుల పెద్దలు ఇబ్బంది పెడుతున్నారని కరీంనగర్​ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావుపల్లికి చెందిన గుండ్రెడ్డి మల్లారెడ్డి వాపోతున్నాడు.

నా తప్పుంటే క్షమించండి.. కానీ నన్ను గుర్తించండి

author img

By

Published : Feb 2, 2021, 12:47 PM IST

అవినీతిపై పోరాడినందుకు తనను కుల బహిష్కరణ చేశారని బాధితుడు వాపోతున్నాడు. స్థానిక పోలీస్​ స్టేషన్​ నుంచి రాష్ట్ర మానవ హక్కుల సంఘం వరకు ఎందరికి ఫిర్యాదు చేసినా తన సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావుపల్లెకు చెందిన గుండ్రెడ్డి మల్లారెడ్డి... తమ కుటుంబాన్ని కుల పెద్దలు నాలుగేళ్ల క్రితం కుల బహిష్కరణ చేశారని వాపోతున్నాడు. తమ కులస్థుల పోరు పడలేక ఊరు విడిచి ఉంటున్నానని... అయినప్పటికీ గ్రామంలోని తన పొలంలో వ్యవసాయం చేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తమతో ఎవ్వరినీ మాట్లాడనివ్వడం లేదని.. తమ పొలంలో ఎవ్వరినీ పనికి రానివ్వడం లేదని పేర్కొన్నాడు.

కొంత కాలంగా తాను తీవ్ర మానసిక ఆవేదనకు గురవ్వుతున్నానని... తన సమస్యపై స్థానిక పోలీసుల నుంచి మానవ హక్కుల సంఘం వరకు అందరికీ ఫిర్యాదు చేసినా ఎవ్వరూ స్పందించడం లేదని వాపోతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నాడు.

ఇదీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.54 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.